: ‘బాహుబలి’లో పాట పాడటంతో నా లైఫ్ పూర్తిగా మారిపోయింది: ఇండియన్ ఐడల్ విజేత రేవంత్


‘బాహుబలి’ చిత్రంలో పాట పాడటం ద్వారా తన జీవితమే మారిపోయిందని, ఈ అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు కీరవాణికి, చిత్ర యూనిట్ కు తన ధన్యవాదాలని ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కష్టపడే తత్వంతో పాటు తెలుగు ప్రజల ఓటింగ్ తో తాను ఇండియన్ ఐడల్ లో విజేతగా నిలిచానని అన్నారు. తనకు మద్దతుగా ప్రతి ఒక్కరికీ తన ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. టాలీవుడ్ తనకు పుట్టినిల్లు అయితే, బాలీవుడ్ అత్తారిల్లు లాంటిదని.. ఈ రెండూ తనకు ముఖ్యమేనని అన్నారు. తెలుగు వాళ్లు బాలీవుడ్ కు వెళ్లి పాడటం లేదనే బాధ తనకు మొదటి నుంచి ఉండేదని, ఆ కసితోనే ఇండియన్ ఐడల్ లో పోటీ చేశానని రేవంత్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News