: లారీ యజమానుల సమ్మెపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. చర్చలకు ఆహ్వానం


లారీ యజమానుల సమ్మెపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. లారీ యజమానుల సంఘాన్ని చర్చలకు ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం మంత్రి అచ్చెన్నాయుడు, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో చర్చలు జరపనున్నారు. కాగా, రవాణా రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న ఆర్థిక భారాలను నిరసిస్తూ సౌత్ జోన్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక బంద్ కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.

కాగా, ఈ రోజుకు లారీల సమ్మె ఏడో రోజుకు చేరింది. నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. బంద్ ప్రభావం నిత్యావసరాలపై పడటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. యూనియన్ నాయకులను చర్చలకు పిలిచింది. ఈ చర్చలు సఫలమైతే బంద్ విరమిస్తామని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News