: అందరి కన్నా అందంగా కనిపించాలని కోరుకుంటా: నటి శిల్పాశెట్టి


అందరి కన్నా అందంగా కనిపించాలని తాను కోరుకుంటానని పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె పై విధంగా స్పందించింది. మళ్లీ తెరపై ఎప్పుడు కనపడతారనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ‘ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతుండటంతో నటించే సమయం దొరకడం లేదు. సినిమాల్లో కొనసాగాలంటే అందంగా కనిపించాలి. ఎందుకంటే, నటులు ప్రతిసారీ కొత్తగా అందంగా కనిపించాలని అభిమానులు కోరుకుంటారు. అందంగా కనిపించడం కోసం మేకప్ పై శ్రద్ధ పెడతాం. అంతేకాకుండా, సినిమాల విషయంలో నటీనటులకు ఒకే రకమైన ఒత్తిడి ఉంటుంది. మంచి కథలు దొరికితే గానీ సినిమాల్లో నటించలేము. ఈ క్రమంలో మంచి కథల కోసం సినీ నటులు, వారి చిత్రాల కోసం అభిమానులు ఓపికగా ఉండక తప్పదు’ అని శిల్పాశెట్టి చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News