: రెండు వేల నోట్లను రద్దు చేస్తామనే వదంతులను నమ్మొద్దు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు


రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజ్ తెలిపారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మధుసూదన్ మిస్త్రీ అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజిజు పైవిధంగా స్పందించారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్ లో నకిలీ కరెన్సీని ఎక్కువగా పట్టుకున్నామని, నకిలీ కరెన్సీని గుర్తించలేకపోతున్నారనే వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. కొత్త నోట్లకు నకిలీ కరెన్సీ తయారు చేయడం సాధ్యం కాదని, చాలా సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త నోట్లను విడుదల చేశామని మంత్రి చెప్పారు. నకిలీ కరెన్సీని నిర్మూలించడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News