: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 7వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఆయన చేరుకోనున్నారు. అనంతరం, మేధావులు, బ్యాంకు ఉద్యోగులతో సమావేశం అవుతారు. పాతబస్తీలోని దళితవాడలో సహపంక్తి భోజనం కూడా చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో, అదే రోజు రాత్రి నిర్వహించే బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.