: శోభాయాత్రకు భారీ బందోబస్తు.. తొలిసారిగా ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాలు వినియోగిస్తున్న పోలీసులు!
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్న శ్రీరాముడి శోభాయాత్రకు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సందర్భంగా ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తుతో పాటు పర్యవేక్షణ నిమిత్తం 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అనుమానితులను గుర్తించేందుకు తొలిసారిగా ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాలను పోలీసులు వినియోగిస్తుండటం విశేషం. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి హైదారాబాద్ నగర సీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.