: స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్ మనవడు
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ కుటుంబం తరపున ఆయన మనవడు హిమాన్ష్ పట్టువస్త్రాలు సమర్పించాడు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారికంగా పట్టువస్త్రాలను స్వామి వారికి అందజేశారు.