: కేటీఆర్! దీనికి ఏం సమాధానం చెబుతారు?: టీడీపీ నేత రావుల


ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సిబ్బంది రూ.40 లక్షలు వసూలు చేశారని, లంచం అడిగితే చెప్పుతో కొట్టాలని చెప్పిన మంత్రి కేటీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతారని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ జిల్లాల్లో ఇసుక దందాలు విచ్చలవిడిగా జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న దానికి.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదని, చేస్తున్న పనుల కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని రావుల విమర్శించారు.

  • Loading...

More Telugu News