: శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి... అయోధ్య ఆలయంలో భక్తుడి మృతి
శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ భక్తుడు ఊపిరాడక మృతి చెందాడు. అయోధ్యలోని కనక భవన్ ఆలయానికి భక్తులు ఎక్కువగా రావడంతో తొక్కిసలాట జరిగిందని, ఈ తొక్కిసలాటలో ఓ భక్తుడికి ఊపిరాడక మృతి చెందాడని ఫైజాబాద్ ఎస్పీ అనంత్ దేవ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.