: ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు చేస్తారు: ధర్మాన ప్రసాదరావు
ఏపీలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తమ పార్టీ అధినేత జగన్ ఫిర్యాదు చేయనున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్, స్పీకర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు దారులను సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గంలోకి తీసుకుంటే గవర్నర్ అడ్డుచెప్పకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తాము ఫిర్యాదు చేసినా గవర్నర్ పట్టించుకోలేదని, రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ వ్యవహరించారని ధర్మాన ఆరోపించారు.