: అబద్ధాలు చెప్పి మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాలి: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
లంచం అడిగితే చెప్పుతో కొట్టాలన్న కేటీఆర్ ను, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి, మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో దళిత నేత బాబు జగ్జీవన్ రామ్ 110వ జయంతి కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీహెచ్ మాట్లాడుతూ, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారంటూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తామని నాడు కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.