: తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన వ్యక్తికి 3 నెలల జైలుశిక్ష
హిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా మరో మతాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తికి మూడు నెలల జైలుశిక్షను విధిస్తూ తిరుపతి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు తీర్పిచ్చింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన షేక్ అబు అంజు అనే వ్యక్తి, గత సంవత్సరం తిరుమలలో ముస్లిం మతాన్ని ప్రచారం చేస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. దీనిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, న్యాయమూర్తి లీలా వెంకట శేషాద్రి కేసును విచారించి, నేరారోపణ రుజువైందని ప్రకటించారు. ఈ మేరకు దోషికి శిక్షను విధిస్తున్నట్టు తెలిపారు.