: బనారస్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో గల హిందూ బనారస్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న తెలుగు యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన భీమ్ రావు... బనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నాడు. యూనివర్సిటీ మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై యూపీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.