: మూడు నెలల ఉచిత ఆఫర్ తో వచ్చేస్తోంది జియో డీటీహెచ్.. ఇంకా పలు ఆఫర్లు!


ఇప్పటికే అతి తక్కువ డేటా టారిఫ్ ప్లాన్లతో ఇతర టెలికం సంస్థలకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్న రిలయన్స్ జియో కన్ను, ఇప్పుడు డీటీహెచ్ రంగంపై పడింది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై పనిచేసే జియో డీటీహెచ్ సెట్ టాప్ బాక్సులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఏ టీవీ చానల్ ను అయినా మరింత స్పష్టంగా వీక్షించే వీలుండేలా ఈ సెట్ టాప్ బాక్సులు ఉంటాయని, నెలకు కనీసం రూ. 180తో ఏ చానల్ నైనా వీక్షించవచ్చని సమాచారం.

ఇక జియో సెల్ కనెక్షన్ మాదిరిగానే, మూడు నెలల ఉచిత ఆఫర్ తో ఈ సెట్ టాప్ బాక్సులు వస్తాయని, ఈ బాక్స్ సాయంతో 1 జీబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలనూ పొందవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సెట్ టాప్ బాక్సుల ద్వారా 50కి పైగా హెచ్డీ చానల్స్ తో పాటు 300కు పైగా వీడియో చానల్స్ ప్రసారాలను వీక్షించవచ్చని సమాచారం. ఈ సెట్ టాప్ బాక్సులకు సంబంధించిన చిత్రాలు, వీటి స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్లో లీక్ అయి వైరల్ గా మారాయి.

  • Loading...

More Telugu News