: శ్రియా భూపాల్ కు ఎన్నారైతో పెళ్లి కుదిరిందా?


టాలీవుడ్ యువనటుడు అక్కినేని అఖిల్ తో డిజైనర్ శ్రేయ భూపాల్ కు ఆమధ్య వివాహ నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సమంత కంటే ముందే రోమ్ లో వివాహానికి ముహూర్తం పెట్టుకున్న ఈ జంట... అకస్మాత్తుగా వివాహం రద్దు చేసుకుంది. అయితే వారి వివాహం రద్దుకు కారణం ఏంటన్న సంగతి ఆ రెండు కుటుంబాలకు తప్ప ఇతరులెవరికీ తెలియదు. దీనిపై ఆ రెండు కుటుంబాలు మౌనం వహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రియా భూపాల్ కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. శ్రియా భూపాల్ కు ఓ ఎన్ఆర్ఐతో సంబంధం కుదిరిందని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు చూసిన ఈ సంబంధానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహం ఘనంగా జరగనుందని సమాచారం. అయితే ఇది నిజమా? పుకారా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News