: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శ్రీరామ నవమి కానుక... జై లవకుశ ఫస్ట్ లుక్ రిలీజ్
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు 'జై లవకుశ' చిత్ర నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ శ్రీరామ నవమి బహుమతి అందజేశారు. జనతా గ్యారేజ్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా జై లవకుశ...ఈ టైటిల్ ముందే ప్రచారంలోకి వచ్చినప్పటికీ... ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఆహార్యానికి సంబంధించిన ఎలాంటి అంశమూ లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు మాత్రం రివీల్ చేశారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. కాగా, మూడు పాత్రల్లో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అయితే సినిమా ఫస్ట్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన అంశమూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జై లవకుశ మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తున్నామని, అందర్నీ అలరిస్తుందని నందమూరి కల్యాణ్ రామ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.