: మరో హెచ్చరిక చేసిన లారీ ఓనర్స్ అసోసియేషన్
గత వారం రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో సమ్మె చేస్తున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ తాజగా మరో హెచ్చరిక చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ సమ్మె జరుగుతోంది. దీంతో దక్షిణాదిలో సుమారు 15 లక్షల సరకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. బీమా ప్రీమియం, టోల్ ట్యాక్స్ తగ్గించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. అలాగే సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలులోకి తేవాలని కోరుతున్నారు.
15 లక్షల సరకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో హోల్ సేల్ మార్కెట్ కు రావాల్సిన కూరగాయలు, పండ్ల రవాణా సగానికి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ మరో హెచ్చరిక జారీ చేసింది. వారం రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తూ.. ఇప్పటివరకు మినహాయింపునిచ్చిన...నిత్యావసర సరకు రవాణాను కూడా నిలిపేస్తామని హెచ్చరించింది. ఈ నెల 8 నుంచి దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తామని తెలిపింది. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని వారు తెలిపారు.