: ముంబైలో హై అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఉగ్రవాదుల ప్రవేశం?
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో హై అలెర్ట్ ప్రకటించింది. భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంబైలో ఐఎస్ఐఎస్ దాడికి తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ముంబైలో చొరబడ్డారని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని ముంబై వాసులు ఆందోళన చెందుతున్నారు.