: భర్త ఆత్మహత్య వెనుక షాకింగ్ విషయాలు చెప్పిన తమిళ నటి నందిని!


తన భర్త కార్తికేయన్ చాలా మోసగాడని, ఎంతో మంది వద్ద డబ్బులు తీసుకుని, వారికి తిరిగివ్వకపోగా, వారంతా తనను ఇబ్బందులు పెట్టారని, ఆయన ఆత్మహత్య వెనుక తనకు సంబంధముందని వచ్చిన వార్తలు అవాస్తవమని తమిళ సినీ, టీవీ నటి నందిని స్పష్టం చేసింది. భర్త ఆత్మహత్య తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె, తన భర్తకు గతంలో ఓ యువతితో వివాహేతర సంబంధం ఉండేదని, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోగా, ఆ కేసులో కార్తికేయన్ ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారని పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎంతో మంది వద్ద డబ్బులు తీసుకున్నాడని, వారంతా తన వద్దకు వస్తే, తాను నిలదీసిన వేళ, ఆత్మహత్య చేసుకుని మరణిస్తానని బెదిరించే వాడని చెప్పింది. ఆపైనే తాను అతనికి దూరంగా ఉంటూ వచ్చానని, తన వద్ద ఉన్న డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నాడన్న విషయం తనకు వివాహం తరువాతనే అర్థమైందని వెల్లడించింది. తన సమస్యలన్నీ ఎవరికీ చెప్పకుండా మనసులోనే దాచుకున్నానని, ఇప్పుడీ ఘటనతో తన పరువు బజారున పడిందని చెప్పుకొచ్చింది. కాగా, విరుగంబాక్కమ్ లోని ఓ లాడ్జ్ లో కార్తికేయన్ ఆత్మహత్య చేసుకోగా, సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News