: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ ద్వారా 'తలాక్' సమస్య చెప్పుకున్న ముస్లిం యువతి!


కరుడుగట్టిన హిందుత్వ వాదిగా పేరు తెచ్చుకుని, ఆపై ఇటీవలి యూపీ ఎన్నికల తరువాత అనూహ్యంగా యూపీ సీఎం పదవిని అధిరోహించి పాలనలో తనదైన శైలిలో దూసుకెళుతూ, అన్ని వర్గాలకూ చేరువవుతున్న యోగి ఆదిత్యనాథ్ కు తన సమస్యను చెప్పుకునేందుకు ఓ ముస్లిం మహిళ ఉత్తరం రాసింది. గతంలోనే పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టి, మోసంతో తనను పెళ్లి చేసుకున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి, విషయం తెలిసి నిలదీస్తే, మూడు సార్లు 'తలాక్' చెప్పి వెళ్లిపోయాడని, తనకు న్యాయం చేయాలని కోరింది.

 తన భర్త కార్మిక శాఖలో పని చేస్తున్నాడని వెల్లడించింది. ఓ కంప్యూటర్ సెంటర్ ను నడుపుకుంటున్న తనకు గత సంవత్సరం నవంబరులో వివాహం జరిగిందని, ఆ సమయంలో రూ. 25 లక్షల విలువ చేసే కారుతో పాటు విలువైన వజ్రాలు, మరెన్నో వస్తువులను కట్న కానుకలుగా ఇచ్చామని, అప్పటికే పెళ్లయిన విషయం తెలుసుకుని నిలదీస్తే, తనను అత్తింటి వారు హింసించారని తెలిపింది. ఇక ఈ లేఖపై యోగి స్పందించారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.

  • Loading...

More Telugu News