: తిరిగింది 300 మీటర్లు... వచ్చింది రూ. 149 కోట్ల బిల్లు... షాకిచ్చిన ఓలా!


ఓ ముంబైవాలాకు ఓలా షాకిచ్చింది. 300 మీటర్ల ప్రయాణానికి ఏకంగా రూ. 149 కోట్ల బిల్లు వేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ముంబైలోని ములుంద్ ప్రాంతవాసి సుశీల్ నర్సియాన్, ఈ నెల 1న వకోలా మార్కెట్ కు వెళ్లేందుకు ఓలా క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. అతన్ని పికప్ చేసుకునేందుకు వచ్చిన డ్రైవర్ అడ్రస్ కనుక్కోలేకపోయాడు. నర్సియాన్ స్వయంగా క్యాబ్ వద్దకు వెళ్లి ఎక్కగా, ఓ 300 మీటర్లు వెళ్లిన తరువాత, కారుకు సమస్య వచ్చి ముందుకు వెళ్లలేకపోయింది.

దీంతో మరో క్యాబ్ ను బుక్ చేసుకునేందుకు నర్సియాన్ ట్రై చేయగా, మీరు రూ. 1,49,10,51,648 బిల్లును చెల్లించాలని, మీ ఓలా యాప్ వ్యాలెట్ లో ఉన్న రూ. 127ను డిడక్ట్ చేశామని మెసేజ్ వచ్చింది. దీంతో అవాక్కైన నర్సియాన్, కాల్ సెంటర్ కు ఫోన్ చేయగా, అది సాంకేతిక సమస్య కావచ్చని, సరి చేస్తామని చెప్పారు. జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో ఉంచగా, నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేశారు. ఓలా తీసుకువెళ్లింది మరో గ్రహానికా? అంటూ జోకులు తెగ పేలాయి.

  • Loading...

More Telugu News