: బాహుబలి-2 విడుదలకు సహకరించండి: కన్నడిగులకు ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడి పిలుపు
బాహుబలి-2 సినిమా విడుదలకు కన్నడిగులు సహకరించాలని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కర్ణాటక గౌరవాధ్యక్షుడు రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని బొమ్మనహళ్లిలో హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్ లో ఉన్న సమర్థనం ట్రస్టులోని చిన్నారులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కావేరి జలాల పంపిణీ విషయంలో కర్ణాటకపై తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఆయన వ్యాఖ్యలను కన్నడ భాషాభిమానులుగా తాము కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. సత్యరాజ్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని బాహుబలి-2 సినిమా ప్రదర్శనను అడ్డుకోవద్దని ఆయన సూచించారు.