: భద్రాద్రికి పోటెత్తుతున్న భక్తులు...దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పూజలు!
భద్రాద్రి రామయ్య కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలానికి శ్రీరామ నవమి శోభ కొత్త అందాన్నిచ్చింది. మరోపక్క భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీరాముని కల్యాణోత్సవంలో పాల్గొని తరించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి పర్యటన రద్దు కాగా, ఆయన బదులు రాముల వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించనున్నారు. అభిజిత్ లగ్నంలో శ్రీరామ కల్యాణం జరగనుందని పండితులు తెలిపారు. కేవలం భద్రాద్రిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా శ్రీరాముని కల్యాణానికి దేవాలయాలు ఏర్పాట్లు చేశాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.