: నువ్వెవరు తల్లీ... అబద్ధాలెందుకు చెబుతున్నావు?: పూరీ హీరోయిన్ కు షాకిచ్చిన హృతిక్ రోషన్
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ హీరోయిన్ కు షాకిచ్చాడు. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన 'రోగ్' సినిమా ఈ మధ్యే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా చెల్లెలు మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏంజెలా మాట్లాడుతూ, హిందీలో హృతిక్ రోషన్ తో పలు యాడ్స్ లో నటించానని, ఆ సందర్భంగా హృతిక్ రోషన్ తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపింది.
సినిమాలకు సంబంధించిన వరకు హృతిక్ ను సలహాలు అడుగుతుంటానని చెప్పింది. అంతే కాకుండా రోగ్ సినిమా ఆఫర్ రాగానే హృతిక్ ను కలిశానని, కథ గురించి చెబితే ఒకే అనగానే తాను అంగీకరించానని చెప్పింది. దీనిని ఓ ఆంగ్ల పత్రిక ప్రధానంగా ప్రచురించింది. దీనిని చూసిన హృతిక్ రోషన్...'మై డియర్ లేడీ...హూ ఆర్ యూ...వై ఆర్ యూ లైయింగ్' అంటూ ఆ కథనాన్ని ట్వీట్ చేశాడు.
My dear lady, who are you and why are u lying. pic.twitter.com/xydPrKr8nH
— Hrithik Roshan (@iHrithik) April 4, 2017