: దేశంలో ఇన్ని ఛార్జిషీట్లు ఉన్న ప్రతిపక్ష నేత మరెవరైనా ఉన్నారా?: మంత్రి యనమల
దేశంలో ఇన్ని చార్జిషీట్లు ఉన్న ప్రతిపక్ష నేత మరెవరైనా ఉన్నారా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని, జగన్ పై 12 చార్జిషీట్లు వేశారని అన్నారు. అసలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. నమ్మక ద్రోహం, మోసం, మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.