: గుజరాత్ కు తొలి మహిళా డీజీపీగా గీతా జోహ్రి
గుజరాత్ రాష్ట్రానికి తొలి మహిళా డీజీపీగా గీతా జోహ్రిని నియమించారు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది.1982 బ్యాచ్ కు చెందిన ఆమె, ప్రస్తుతం గుజరాత్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అంతేకాకుండా, పోలీసు అధికారిణిగా పలు హోదాల్లో ఆమె బాధ్యతలు నిర్వహించారు. ఇంతకుముందు, గుజరాత్ డీజీపీగా పి.పి.పాండే వ్యవహరించారు. గత జనవరిలో ఆయన రిటైర్ అయ్యారు. అయితే, మూడు నెలల పాటు ఆయన సర్వీసును ప్రభుత్వం పొడిగించింది. కానీ, ఇష్రాత్ జహాన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో పాండే ప్రధాన నిందితుడు. దీంతో, ఆయన పదవీకాలం పొడిగించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో, డీజీపీ పదవికి పాండే రాజీనామా చేయగా ప్రభుత్వం సోమవారంనాడు ఆమోదించింది.