: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఆసుపత్రి నుంచి త్వరలో డిశ్చార్జి !
అతిసార వ్యాధితో ఇటీవల అస్వస్థతకు గురైన బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, త్వరలోనే డిశ్చార్జి కానున్నారని వినోద్ ఖన్నా కుమారుడు రాహుల్ తెలిపారు. తన తండ్రి కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ లు చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు తన కృతఙ్ఞతలు చెబుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. కాగా, గత శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన వినోద్ ఖన్నాను గుర్ గావ్ లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో చేర్చారు.