: నాకు ముఖ్యమంత్రితోనే పోటీ: యువ మంత్రి నారా లోకేష్


తాను పనిలో ముఖ్యమంత్రితోనే పోటీ పడతానని యువ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో మీడియాతో లోకేష్ కొంచెం సేపు చిట్ చాట్ చేశారు. తనకు కీలక శాఖలు కేటాయించారని, ఛాలెంజింగ్ గా పని చేస్తానని అన్నారు. ఐటీలో తనకు ఉన్న పరిచయాలతో పెట్టుబడులు తీసుకు వస్తానని, తాను మంత్రి కాక ముందే పెట్టుబడుల కోసం ప్రయత్నించానని, అయితే వైఎస్సార్సీపీ అడ్డుపడిందని అన్నారు. అవినీతికి పాల్పడే వాళ్లు భయపడాలని, తనపై 420 కేసులు లేవని అన్నారు. తన ఛాంబర్ పెద్దగా ఉండాలనేమీ లేదని, ఏ పరిస్థితుల్లో నైనా పని చేస్తానని లోకేష్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News