: ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త.. త్వరలో ప్రత్యేక రైల్వేజోన్?


ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త. వైజాగ్ ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుపై త్వరలోనే ఓ ప్రకటన వెలువడనుంది. ఈ మేరకు టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పి.వి.ఎన్. మాధవ్ తెలిపారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని, ప్రకటన వెలువడటమే ఆలస్యమని అన్నారు. ఈ విషయమై రైల్వే మంత్రితో బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, హరిబాబు పూర్తి స్థాయి చర్చలు జరిపారని అన్నారు.

  • Loading...

More Telugu News