: ఢిల్లీకి మరోషాక్... ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ కి చికెన్ పాక్స్


ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు మరోషాక్ తగిలింది. ఇప్పటికే కెప్టెన్ జేపీ.డుమిని, స్టార్ బ్యాట్స్ మన్ క్వింటన్ డికాక్ దూరమైన ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ కూడా దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో తుదిజట్టులో లేకుండా ప్రత్యర్ధి ఆటగాడిని అవుట్ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కిన శ్రేయస్ అయ్యర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికెన్ పాక్స్ (ఆటలమ్మ)తో బాధపడుతున్నట్టు ఢిల్లీ జట్టు తెలిపింది. అది ఎప్పుడు తగ్గుతుంది అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ప్రారంభ మ్యాచ్ లకు మాత్రం దూరంకానున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆసీస్ తో వార్మప్ మ్యచ్ లో ద్విశతకం బాది శ్రేయస్ అయ్యర్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News