: ముద్రగడ పద్మనాభంపై పుస్తకాలు రాయించే తీరిక చంద్రబాబుకు లేదు: చినరాజప్ప
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై పుస్తకాలు రాయించే తీరిక చంద్రబాబుకు లేదని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప అన్నారు. ప్రజలు తనను మర్చిపోతున్నారని భావించినప్పుడల్లా సీఎంను విమర్శిస్తూ ముద్రగడ లేఖలు రాస్తుంటారని ఆయన విమర్శించారు. కాపుల స్థితిగతుల గురించి మంజునాథ కమిషన్ కు ముద్రగడ చెప్పకపోగా, ఏ ఇతర నేతనూ మాట్లాడనివ్వకుండా ఆయన అనుచరులు అడ్డుకున్నారని చినరాజప్ప ఆరోపించారు. అప్పట్లో, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం చేతకాలేదని ఎన్టీఆర్ తిట్టడంతో ముద్రగడ పద్మనాభం తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చినరాజప్ప గుర్తుచేశారు.