: మసూద్‌ విషయంలో మా దేశం వెనకడుగు వేయబోదు: చైనా తీరుపై అమెరికా


పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించ‌డానికి భార‌త్ చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌కి చైనా అడ్డుత‌గులుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ అంశంపై చైనాను ప‌ట్టించుకోకుండా అమెరికా ముంద‌డుగు వేస్తోంది. ఈ విషయంలో తమ పాత్రను కచ్చితంగా పోషిస్తామని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా కొన్ని దేశాలు వీటో అధికారాన్ని ప్రయోగించినంత మాత్రాన త‌మ దేశం వెన‌క‌డుగు వేయ‌బోద‌ని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకుని తీరుతామని అన్నారు. చైనా వీటోను ఉప‌యోగించుకుంటూ అడ్డంకులు తెస్తున్న నేపథ్యంలో అమెరికా ఇటువంటి వ్యాఖ్య‌లు చేసింది.

  • Loading...

More Telugu News