: రష్యాలో మెట్రో స్టేషన్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడింది మా దేశస్తుడే: కిర్గిస్థాన్
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ మెట్రో స్టేషన్లో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది ప్రయాణికులు దుర్మరణం పాలవగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానించారు. అయితే దాడికి పాల్పడినట్టు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.
అయితే, మెట్రో స్టేషన్ లో దాడికి పాల్పడింది తమ దేశస్తుడే అని కిర్గిస్థాన్ ప్రకటించింది. దాడికి పాల్పడిన వ్యక్తి అక్బర్ జాన్ డలిలోవ్ (22) అని తెలిపింది. అక్బర్ జాన్ రష్యా పౌరసత్వం తీసుకుని ఉంటాడని ఆ దేశ సెక్యూరిటీ సర్వీసెస్ అధికారి తెలిపారు.