: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంపీ కేకేకు చేదు అనుభవం


పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు హైదరాబాద్ తార్నాకలోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ ఎంపీ కే కేశవరావుకు చేదు అనుభవం ఎదురైంది. కేకే గెటవుట్‌ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో వర్సిటీలో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ రోజు ఓయూలోని ఆర్ట్స్‌ కాలేజీలోని ప్రిన్సిపల్‌ చాంబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేకే ఆ త‌రువాత ఓయూ ఉత్సవాల క‌మిటీతో మాట్లాడారు. అనంత‌రం ఆయ‌న బయటకు వస్తుండగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి మూడేళ్లు అవుతున్నా, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టలేదని విద్యార్థులు మండిప‌డ్డారు. కేకేకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనపైకి వందలాది మంది విద్యార్థులు దూసుకెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకొనే క్ర‌మంలో ఉద్రిక్తత నెల‌కొంది.

  • Loading...

More Telugu News