: నారా లోకేశ్ ను కలసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల!
ఏపీ కొత్త మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఈ రోజు కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో లోకేశ్ ను కలిసి ఆయన్ని అభినందించారు. లోకేశ్ తో సుమారు గంట సేపు ధూళిపాళ్ల చర్చించారు. మంత్రి పదవికి కావాల్సిన పూర్తి స్థాయి అర్హతలు ధూళిపాళ్లకు ఉన్నాయని, సమీకరణాల కారణంగా పదవి ఇవ్వడం సాధ్యపడలేదని ఈ సందర్భంగా ధూళిపాళ్లతో లోకేశ్ అన్నట్లు సమాచారం. టీడీపీ కోసం ధూళిపాళ్ల చేసిన కృషిని విస్మరించలేమని, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని లోకేశ్ నచ్చజెప్పారు. సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడాలని ధూళిపాళ్లకు యువ మంత్రి లోకేశ్ సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం.