: అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
అమెరికాలోని సియాటెల్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న మధురెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధురెడ్డికి ఆర్థిక సమస్యలు కాని, కుటుంబ సమస్యలు కానీ ఏమీ లేవని ఆయన బంధువులు చెబుతున్నారు. వారానికి రెండు, మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడేవాడని... ఏ కారణంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడో అర్థం కావడం లేదని తెలిపారు. మధురెడ్డి యాదాద్రి-భువనగిరి జిల్లాలోని రాళ్లజనగాంకు చెందిన వ్యక్తి. ఈయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. నల్గొండ, హైదరాబాదుల్లో చదువుకున్న మధురెడ్డి, కొంత కాలం క్రితం సియాటెల్ వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు.