: తెలంగాణ దళిత యువకుడి మృతికి నిరసన.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో దళిత యువకుడు మధుకర్ మృతిని నిరసిస్తూ జేఎన్ యూ విద్యార్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. మధుకర్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. తెలంగాణ పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
దళిత యువకుడు మధుకర్ అనుమానాస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇది ముమ్మాటికీ హత్యే అని... న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, మంథనిలో పలు దళిత సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి.