: పవన్ కల్యాణ్ తో ఫస్ట్ డే షూట్...ఎక్సైటెడ్: అను ఇమ్మాన్యుయేల్
'కాటమరాయుడు' సినిమా తరువాత పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హారిక-హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది.
ఈ సందర్భంగా అను ఇమ్మాన్యుయేల్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫోటో పోస్టు చేసి, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపింది. తొలి రోజు షూటింగ్ అద్భుతంగా జరిగిందని, అద్భుతాలు జరుగుతాయని పేర్కొంది. కాగా, ఇంతవరకు సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరోలతో నటించని అను ఇమ్మాన్యుయేల్ కు నేరుగా పవన్ కల్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం మంచి అవకాశమే అని సినీ అభిమానులు పేర్కొంటున్నారు.