: ఎన్టీఆర్ కుటుంబంలోని మూడు తరాలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది: అయ్యన్నపాత్రుడు
ఎన్టీఆర్ కుటుంబంలోని మూడు తరాల వారితో కలిసి పనిచేయడం తనకు సంతోషంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు కేటాయించిన రోడ్లు భవనాల శాఖ సంతృప్తి కరంగా ఉందని, అందరి సమన్వయంతో తాను పని చేస్తానని అన్నారు. అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరిగిందని, అందరికీ పదవులు ఇవ్వడం కష్టమని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా పని చేసిన అనుభవం తనకు ఉన్నందున ఆ శాఖ బాధ్యతలు కొత్తగా స్వీకరించిన నారా లోకేశ్ కు అవసరమైతే సలహాలు ఇస్తానని చెప్పారు.