: నేను, నా కుటుంబ సభ్యులు ఇకపై బీఫ్ తినం: అజ్మీర్ దర్గా చీఫ్ అలీ ఖాన్


దేశ వ్యాప్తంగా గోవధను నిషేధిస్తే... భారత్ లో మత సామరస్యం నెలకొంటుందని అజ్మీర్ దర్గా చీఫ్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ అన్నారు. గోవుల వధపైనే కాకుండా, బీఫ్ అమ్మకాలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించాలని ఆయన కోరారు. ముస్లింలు దీనికి సహకరించాలని అన్నారు. గో జాతి పశువులను వధించడాన్ని ముస్లింలు మానుకోవాలని... గొడ్డు మాంసానికి దూరమవ్వాలని సలహా ఇచ్చారు. అజ్మీర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్తీ ఉర్సు ఉత్సవాల్లో వివిధ దర్గాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు. వీరందరి సమక్షంలో అలీ ఖాన్ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను కాని, తన కుటుంబ సభ్యులు కాని బీఫ్ తినబోమని ఆయన తెలిపారు. అంతేకాదు, మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం కూడా తప్పేనని... ఇది షరియా చట్టానికి విరుద్ధమని చెప్పారు.

  • Loading...

More Telugu News