: విద్యార్థినులు నిర్వహించిన తిండి పోటీలో పాల్గొన్న యువతి మృతి
పాన్ కేక్‌ను తినే పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని కనెక్టికట్‌లోని సేక్రడ్ హార్ట్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. విద్యార్థినులు పెట్టుకున్న సరదా పోటీ ఆ అమ్మాయి ప్రాణాలు తీయడంతో యూనివర్సిటీలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. పాన్ కేక్ తినే పోటీలో పాల్గొన్న ఆ యువతి ఆ పదార్థాన్ని వేగంగా తినే క్రమంలో మధ్యలో ఉక్కిరిబిక్కిరై మృతి చెందింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని పేరు కైట్లిన్ నెల్సన్. ఆమె నర్సింగ్ జూనియర్ విద్యార్థినిగా చదువుతూ సోషల్ వర్క్ విభాగాన్ని ఎంచుకుంది. ఆమె తండ్రి జేమ్స్ నెల్సన్ న్యూయార్క్‌లో పోర్ట్ అథారిటీ విభాగంలో పోలీసు అధికారిగా పనిచేసేవారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై సెప్టెంబర్ 11న బాంబు దాడి జరిగిన సమయంలో ప్రజలను కాపాడే క్రమంలో ఆయన మృతి చెందాడు. కైట్లిన్ నెల్సన్‌కి కూడా తండ్రిలాగే సామాజిక సృహ ఎక్కువ.