: తీసుకున్న బాకీని తీర్చమన్నందుకు మహిళకు నిప్పంటించి ప్రాణాలు తీసిన వ్యక్తి


అప్పు ఇచ్చిన పాపానికి ఓ మహిళ తన ప్రాణాలనే కోల్పోయింది. తీసుకున్న బాకీ చెల్లించమని అడిగినందుకు ఓ మహిళపై ఓ వ్య‌క్తి కిరోసిన్ పోసి నిప్పంటించి ప్రాణాలు తీసిన ఘ‌ట‌న పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణంలోగల తిలక్‌నగర్‌లో క‌ల‌క‌లం రేపింది. కొన్ని రోజుల క్రితం స్రవంతి అనే మ‌హిళ శ్రీనివాస్ అనే వ్యక్తికి రూ.40 వేలను అప్పుగా ఇచ్చింది. ఆ త‌రువాత ఆ బాకీని వ‌సూలు చేసే క్ర‌మంలో నానా తిప్ప‌లు ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే అప్పు తీర్చాలంటూ ఈ రోజు ఉద‌యం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి నిల‌దీసింది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన శ్రీ‌నివాస్ తన ఇంట్లోని కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. ఆమెను స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.        


  • Loading...

More Telugu News