: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కోకుంటే ఏనాడో ప్రత్యేక హోదా వచ్చేది: సినీ నటుడు శివాజీ
ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు ఇరుక్కోకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏనాడో లభించి వుండేదని సినీ నటుడు శివాజీ అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన, స్వామి దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. కేసుల్లో ఇరుక్కుని, కేంద్రం చెప్పినదానికల్లా ఆయన తలూపాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం శూన్యమని చంద్రబాబు స్వయంగా ప్రచారం చేస్తుండటాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు చెబుతున్న కథలను ప్రజలు వింటున్నారని, ఇక ఈ విషయంలో మాట్లాడేది ఏముందని కొంత నిర్వేదాన్ని ఆయన వ్యక్తం చేయడం గమనార్హం. చంద్రబాబు ఏం చెబితే అదే మహాభారతం, రామాయణం అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై విచారణ లేకుంటే హోదా ఎన్నడో వచ్చేదని, ఇంతకంటే చెప్పేదేమీ లేదని అన్నారు.