: ఆంధ్రజ్యోతి ఆఫీస్ లో నారా లోకేష్.. స్వాగతం పలికిన ఎండీ రాధాకృష్ణ


ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఏపీ కొత్త మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. ఆంధ్రజ్యోతి నిర్వహించిన 'గోల్డ్ అండ్ కార్ రేస్' మెగా డ్రా కార్యక్రమానికి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ కు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ లక్కీ డ్రా తీశారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురానికి చెందిన హన్మంతరావుకు ఈ మెగా డ్రాలో కారు బహుమతి దక్కింది. వెంటనే హన్మంతరావుకు ఫోన్ చేసిన లోకేష్... డ్రాలో కారు తగిలినట్టు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. లోకేష్ రాకతో ఆంధ్రజ్యోతి కార్యాలయంలో సందడి నెలకొంది.

  • Loading...

More Telugu News