: ఈ ఫిరాయింపుల కంపేంటి? మనం సమర్థిస్తున్నట్టుంది!: బీజేపీ హైకమాండ్ కు పురందేశ్వరి ఘాటు లేఖ


ఆంధ్రప్రదేశ్ లో వైకాపా నుంచి వచ్చిన వారిని తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులుగా నియమించడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆ పార్టీ మహిళా నేత పురందేశ్వరి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా బీజేపీ ఉండటంతో, పార్టీ పట్ల ప్రజల్లో సైతం సదభిప్రాయం పోతోందని తన లేఖలో పురందేశ్వరి ఆరోపించారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించిన ఆమె, పార్టీ ఫిరాయింపుల చట్టం తెలుగు రాష్ట్రాల్లో అపహాస్యం పాలవుతోందని తెలిపారు. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ సైతం ఈ ఫిరాయింపులను సమర్థిస్తున్న సంకేతాలు వెళుతున్నాయని, భవిష్యత్తులో పార్టీ ఎదుగుదలకు ఇది అడ్డంకిగా మారే ప్రమాదముందని పురందేశ్వరి తన లేఖలో అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News