: బాహుబలి-2 వేడుకకు హాజరుకానున్న తమిళ సూపర్ స్టార్లు
విడుదలకు ముందే 'బాహుబలి-2' సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వార్త బయటకు వచ్చినా... సంచలనంగా మారుతోంది. ఏప్రిల్ 28న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. తెలుగు వర్షన్ కు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఆడియో వేడుకను నిర్వహించారు. ఇప్పుడు తమిళంలో కూడా ఆడియో ఫంక్షన్ ను నిర్వహించేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ ఫంక్షన్ ను కూడా భారీ స్థాయిలో నిర్వహించాలని వీరు భావిస్తున్నారట. ఈ వేడుకకు కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్, విజయ్ లు హాజరవుతున్నారట.