: నిద్రిస్తున్న చిన్నారులపై నుంచి వెళ్లిన ట్రక్కు.. నలుగురి మృతి
నిద్రిస్తున్న చిన్నారులపై ఓ ట్రక్కు దూసుకెళ్లడంతో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘోర ప్రమాద ఘటన జార్ఖండ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. పాలము జిల్లాలోని హరిహర్గంజ్లో చేపడుతున్న ఓ నిర్మాణం వద్ద పలువురు కూలీలు పనిచేసుకుంటున్నారు. అయితే, వారి పిల్లలు నిన్న రాత్రి అదే ప్రాంతంలో నిద్రిస్తుండగా, ఈ విషయాన్ని గుర్తించని ట్రక్కు డ్రైవర్.. వారి మీదుగా వాహనాన్ని తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. అనంతరం ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారయ్యాడు.