: మియాపూర్ లోని శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై దాడులు


ఇంటర్ పరీక్షలు ముగిసి సెలవులు ఇచ్చిన తరువాత కూడా క్లాసులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలపై తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం దాడులు నిర్వహించారు. హైదరాబాదు శివారు మియాపూర్ లోని కాలేజీలు పని చేస్తుండటం, విద్యార్థులు ఉండటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన అధికారులు, క్లాసులు ఎందుకు నిర్వహిస్తున్నారన్న విషయమై వెంటనే సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. పలు కార్పొరేట్ కాలేజీల్లో వేసవిలోనూ క్లాసులు జరుగుతున్నాయన్న సమాచారం తమకు అందిందని, అందువల్లే దాడులకు వచ్చామని ఓ అధికారి తెలిపారు. వేసవిలో క్లాసులు నిర్వహిస్తే, కాలేజీల గుర్తింపు రద్దుతో పాటు యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News