: బెయిల్ అవకాశమున్నా, జైలుకు వెళ్లిన వైగో


దేశద్రోహం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఎండీఎంకే నేత వైగో, తనకు బెయిల్ లభించే అవకాశమున్నా, దాన్ని తిరస్కరించి జైలుకు వెళ్లారు. లంక తమిళ టైగర్లకు విధేయుడిగా ఉండి, తరచూ వివాదాలు కొనితెచ్చుకునే వైగోపై 2009లో దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా తానే స్వయంగా వాదనలు వినిపిస్తూ వచ్చిన ఆయన, నిన్న జరిగిన వాదనల్లో ఎల్టీటీఈకి మద్దతుగా కోర్టులో మాట్లాడారు. తన వ్యాఖ్యలను సమర్థించుకున్న వైగోను న్యాయమూర్తి హెచ్చరిస్తూ, ధోరణి మార్చుకోవాలని, లేకుంటే జైలుకు వెళ్లాలని అన్నారు. తాను జైలుకు వెళ్లేందుకే సిద్ధమని వైగో స్పష్టం చేయడంతో 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశాలు ఇచ్చిన జడ్జి, ఆపై బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశాన్ని కల్పించారు. తనకు బెయిల్ వద్దని, జైలుకే వెళతానని వైగో చెప్పడంతో, పోలీసులు పుళల్ కేంద్ర కారాగారానికి ఆయన్ను తరలించారు.

  • Loading...

More Telugu News