: తునిలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. పలువురికి గాయాలు


తూర్పు గోదావరి జిల్లా తునిలో కొద్దిసేపటి క్రితం భారీ పేలుడు సంభవించింది. పట్టణ పరిధిలోని ఇసుకల పేటలో ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు గాయపడినట్టు, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరిని స్థానిక అసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ఘటనా స్థలికి తరలివెళ్లాయి. పేలుడుపై మరింత సమాచారం అందాల్సివుంది.

  • Loading...

More Telugu News